akhilesh yadav: నా కొత్త ఇంటికి మీడియాను రానీయను: అఖిలేశ్ యాదవ్

  • ఎట్టకేలకు ఓ విల్లాలోకి మకాం మార్చిన అఖిలేశ్
  • చెప్పేది ఒకటి, చూపించేది ఒకటి అంటూ మీడియాపై విమర్శలు
  • మీడియాను దూరంగా పెడతానని ప్రకటన

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మీడియా పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవలే ఖాళీ చేసిన ప్రభుత్వ భవనానికి అఖిలేశ్ నష్టం కలిగించినట్టు వార్తలు పెద్ద ఎత్తున రావడమే ఆయన ఆగ్రహానికి కారణం. అందుకేనేమో తన కొత్త ఇంటికి మీడియాను ఆహ్వానించబోనని స్పష్టం చేశారు.

‘‘మీరు ఒకటి చెబుతారు. మరొకటి చూపిస్తారు’’ అని మీడియా తీరును అఖిలేశ్ విమర్శించారు. తప్పనిసరై ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిన తర్వాత అఖిలేశ్ తొలుత వీవీఐపీ గెస్ట్ హౌస్ లో కొన్ని రోజుల పాటు ఉన్నారు. అనంతరం సుల్తాపూర్ రోడ్డులోని అన్సాల్ టౌన్ షిప్ లో ఉన్న సుశాంత్ గోల్ఫ్ సిటీలోని విల్లాలోకి అఖిలేశ్ మారారు.

akhilesh yadav
new residence
  • Loading...

More Telugu News