New Delhi: 7 నిమిషాలు మాట్లాడనిచ్చి, ఆపై చంద్రబాబును అడ్డుకున్న రాజ్ నాథ్ సింగ్!

  • రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం
  • కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు
  • విమర్శలు కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడాలన్న రాజ్ నాథ్

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు మాట్లాడుతున్న వేళ, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అడ్డుకున్నారు. తన ప్రసంగంలో కేంద్రం వైఖరిని విమర్శిస్తున్న చంద్రబాబును 7 నిమిషాల తర్వాత ఆయన అడ్డుకున్నారు.

ఇది విమర్శలు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదని, వచ్చే ఐదేళ్లలో జరగాల్సిన అభివృద్ధిపై మాట్లాడాలని, సూచనలు చేయాలని రాజ్ నాథ్ కోరారు. అభివృద్ధిని గురించి మాట్లాడకుండా, విమర్శలే చేయాలంటే మరో వేదికను చూసుకోవచ్చని అన్నారు. తాను అభివృద్ధి గురించే మాట్లాడుతున్నానని, ప్రజా సమస్యలు కేంద్రానికి పట్టడం లేదని ఒకింత ఆగ్రహంతో మాట్లాడిన చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

New Delhi
Niti Aayog
Chandrababu
Rajnath Singh
  • Loading...

More Telugu News