ABN Andhrajyothi: నగరిలో మళ్లీ గెలిచేది రోజాయే... లగడపాటి నేతృత్వంలోని ఆర్జీ ఫ్లాష్ టీం సర్వే!

  • ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం సర్వే
  • 2014 ఎన్నికలకు, సర్వే ఫలితానికి కనిపించని తేడా
  • వైకాపా వైపే మొగ్గుందంటున్న సర్వే

చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని, నగరి ప్రజలు నరేంద్ర మోదీపై పెంచుకున్న కోపం, తెలుగుదేశం పార్టీకి విఘాతంగా మారిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం సర్వే నిర్వహించిన లగడపాటి నేతృత్వంలోని ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేర్కొంది. ప్రస్తుతం నటి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో స్వల్ప మెజారిటీతోనైనా వైకాపా గెలుస్తుందని సర్వే చేసిన టీమ్ తేల్చింది.

2014 ఎన్నికల ఫలితాలకు, తమ సర్వేలో వచ్చిన ఫలితానికి పెద్దగా తేడా లేదని వెల్లడించింది. కాగా, 2014 ఎన్నికల్లో రోజా చేతిలో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో నగరిలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందని కూడా ప్రజలు భావిస్తున్నారని సర్వే పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News