LG: ఢిల్లీ 'ఎల్జీ' పనిచేయడం లేదన్న బాలీవుడ్ నిర్మాత శిరీష్ కుందర్... వెంటనే స్పందించిన 'ఎల్జీ'... ఆపై నవ్వులే నవ్వులు!

  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో కేజ్రీవాల్ దీక్ష
  • ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ను ట్యాగ్ చేసిన శిరీష్ కుందర్
  • కాంటాక్టు వివరాలు పంపించాలన్న ఎల్జీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తన ముగ్గురు మంత్రివర్గ సహచరులతో కలసి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఐదు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న వేళ, ట్విట్టర్ లో పేలిన ఓ జోక్ నవ్వులు పూయిస్తోంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత శిరీష్ కుందర్ ఈ ట్విట్ చేయగా అదిప్పుడు వైరల్ అయింది.

 తన ట్విట్టర్ ఖాతాలో "మీకు ఢిల్లీలో సర్వీస్ సెంటర్ ఉందా? ఇక్కడ ఎల్జీ పనిచేయడం లేదు. ఇతరులను పనిచేసుకోనివ్వడం లేదు" అని వ్యాఖ్యానిస్తూ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఇండియాను ట్యాగ్ చేశారు. దీనిపై ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వెంటనే స్పందించింది. "అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ కాంటాక్టు వివరాలు పంపిస్తే, సాధ్యమైనంత త్వరలో సాయపడతాం" అని బదులిచ్చింది. అంత వేగంగా స్పందించినందుకు కుందర్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈ ట్వీట్ సూపరని, దీన్ని చూసి అనిల్ బైజల్ సైతం నవ్వుకుని ఉంటారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

LG
Lt. Governer
Anil Baizal
LG Electronics
Sirish Khunder
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News