Chattisghar: ఛత్తీస్ గఢ్ లో యువ జర్నలిస్టులు శైలేంద్ర, రేణు ఆత్మహత్య!

  • జగదల్ పూర్ లో కలకలం
  • రెండు వేర్వేరు కేసులుగా నమోదు
  • విచారణ చేస్తున్నామన్న పోలీసులు

ఇద్దరు యువ జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ లో కలకలం రేపింది. 'పత్రిక' పేరిట నడుస్తున్న దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న రేణు అవస్థి (21) అనే యువతి, ఐఎన్ఎస్ న్యూస్ చానల్ లో రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న శైలేంద్ర వి సుఖర్మ (34) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలనూ వేర్వేరు కేసులుగా నమోదు చేసుకున్న పోలీసులు కేసులను దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు. వీరిద్దరి ఆత్మహత్యలకూ ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామని, మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించామని వెల్లడించారు.

Chattisghar
Journalists
Renu Avasthi
Sailendra
Sucide
  • Loading...

More Telugu News