survey: ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?.. లగడపాటి ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ సర్వే వివరాలు ఇవిగో!

  • టీడీపీకి 110.. వైసీపీకి 60
  • ఇతరులకు 5 సీట్లు
  • ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కోసం సర్వే

ఆంధ‌్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందన్న విషయంపై లగడపాటి ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ తమ కోసం సర్వే చేసిందని ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఆ సర్వే వివరాలను 'ఏపీ పల్స్'  పేరిట విడుదల చేసింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ-110, వైసీపీ-60, ఇతరులు-5  సీట్లు గెలుచుకుంటారని పేర్కొంది.

ఈ సర్వేలో భాగంగా ఐదు ప్రశ్నలు అడిగింది. అవి.. 1) ఏ పార్టీకి ఓటేస్తారు? 2) ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? 3) హోదా కోసం పోరాడుతున్నది ఎవరు? 4)
చంద్రబాబుకి ఎన్ని మార్కులు వేస్తారు?  5) ఏపీకి మోదీ అన్యాయం చేశారా?

లగడపాటి ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ తమ కోసం సర్వే చేసిందని ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం ప్రకారం..

1) ఏ పార్టీకి ఓటేస్తారు?.... 44.04 శాతం మంది టీడీపీకి ఓటు వేస్తామని, 37.46 శాతం మంది వైసీపీకి, 8.90 శాతం మంది జనసేనకి, బీజేపీకి 1.01 శాతం మంది, ఇతరులు 3.19 శాతం మంది ఓట్లు వేస్తామని అన్నారు.

2) ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి?... టీడీపీ 110, వైసీపీ 60, ఇతరులు 5  సీట్లు గెలుచుకుంటారు.

3) హోదా కోసం పోరాడుతున్నది ఎవరు?... 43.83 శాతం మంది టీడీపీ అని చెప్పగా, వైసీపీ అని 37.46 శాతం మంది అన్నారు. జనసేన అని 9.65 శాతం, ఇతరులని 4.87 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

4) చంద్రబాబుకి ఎన్ని మార్కులు వేస్తారు?... 53.69 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 46.31 శాతం సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు.

5) ఏపీకి మోదీ అన్యాయం చేశారా?.. అవును అని 83.67 శాతం మంది సమాధానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News