sai dharam tej: మెగా హీరోలతో పాటు రంగంలోకి దిగుతున్న గోపీచంద్!

  • వచ్చేనెల 6వ తేదీన 'తేజ్ ఐ లవ్ యూ'
  • అదే రోజున థియేటర్లకు 'విజేత'
  • 'పంతం' కూడా ఆ రోజునే రిలీజ్

కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన 'తేజ్ ఐ లవ్ యూ' .. వచ్చేనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ చేసిన 'విజేత' కూడా వచ్చేనెల 6వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు ఒకే రోజున విడుదల కావడం పట్ల కొంతకాలం క్రితం అల్లు అర్జున్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అలా జరగకుండా చూసుకోవాలని అన్నారు.

అయినా తేజు .. కల్యాణ్ దేవ్ సినిమాలు ఒకే రోజున వస్తుండటం విశేషం. ఇదే రోజున రావడానికి గోపీచంద్ కూడా రెడీ అవుతున్నాడు. గోపీచంద్ హీరోగా .. ఆయన 25వ సినిమాగా చక్రి దర్శకత్వంలో 'పంతం' సినిమా రూపొందింది. ఈ సినిమాను కూడా వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూడు సినిమాలు కూడా కంటెంట్ పరంగా పూర్తిగా వైవిధ్యభరితమైనవి కావడం వలన పోటీ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      

sai dharam tej
kalyan dev
  • Loading...

More Telugu News