china: దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానున్న మరో చైనా కంపెనీ ‘హోమ్ టామ్’

  • బడ్జెట్ రేంజ్ మార్కెట్ లక్ష్యం
  • రూ.8,000 ధరతో ఫోన్లను తీసుకొస్తామని కంపెనీ ప్రకటన
  • తయారీ భారత్ లోనే

దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి చైనాకు చెందిన హోమ్ టామ్ బ్రాండ్ కింద త్వరలో ఫోన్లు రానున్నాయి. హోమ్ టామ్ అన్నది షెంజెన్ జౌజి హ్యాంగ్ టాంగ్ టెక్నాలజీ కంపెనీకి చెందిన బ్రాండ్. బడ్జెట్, మధ్య స్థాయి ధరల్లో స్మార్ట్ ఫోన్లను తీసుకురావాలనుకుంటోంది. ఇప్పటికే నోయిడాలో క్యాంపస్ ఏర్పాటు చేసింది. స్థానికుల అవసరాలు, వారి వినియోగ తీరును తెలుసుకున్న అనంతరం భారత్ లోనే ఫోన్లను తయారు చేయాలని నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2013లో ప్రస్థానం ప్రారంభించిన ఈ కంపెనీ 200కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. భారత్ లో ప్రారంభంలో రూ.8,000 ధరల్లో ఫోన్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

china
smart phone
homtom
  • Loading...

More Telugu News