airtel: ఇక రూ.99కే రోజూ 2జీబీ డేటా.. ఎయిర్ టెల్ ఆఫర్

  • ప్రస్తుతం రూ.99 ప్లాన్ లో రోజూ ఒక జీబీ డేటాయే
  • జియో పోటీ కారణంగా డేటా పరిమితి 2జీబీకి పెంపు
  • బీఎస్ఎన్ఎల్ సైతం రోజూ 1.5 జీబీ డేటా ఆఫర్

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ తన రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ కు మెరుగులు దిద్దింది. ఇకపై ప్రతి రోజూ 2జీబీ డేటా చొప్పున 28 రోజుల పాటు సేవలు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.99 ప్లాన్ లో రోజూ ఒక జీబీ డేటా మాత్రమే ఉచితం. రిలయన్స్ జియో రూ.98 ప్లాన్ లో ప్రతిరోజూ 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ కూడా రోజూ 1.5జీబీ డేటాను అందిస్తోంది. ఈ పోటీ నేపథ్యంలో ఎయిర్ టెల్ రూ.99 ప్లాన్ ను అప్ గ్రేడ్ చేసింది. ఇందులో అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లను కూడా ఉచితంగా అందిస్తోంది.

airtel
data pack
prepaid
  • Loading...

More Telugu News