Donald Trump: కిమ్ కు నా డైరెక్ట్ నంబర్ ఇచ్చా... ఏ సమస్య వచ్చిన కాల్ చేయవచ్చని చెప్పా: ట్రంప్

  • ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఉత్తరకొరియాకు కాల్ చేస్తా
  • ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు ట్రంప్ ఇంటర్వ్యూ
  • నేను సైతం కిమ్ తో నేరుగా మాట్లాడతా

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తనతో సంప్రదించేందుకు డైరెక్ట్ ఫోన్ నంబర్ (మధ్యలో మరెవరి ప్రమేయం లేని నంబర్) ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇటీవలే సింగపూర్ లో ఈ ఇరువురు నేతలు చర్చలు జరిపి, చారిత్రాత్మక ఒప్పందానికి  వచ్చిన విషయం తెలిసిందే.

 అణునిరాయుధీకరణ దిశగా నడిచేందుకు కిమ్ అంగీకరించగా, ఉత్తరకొరియా భద్రతకు ట్రంప్ పూచీ ఇచ్చారు. ‘‘కిమ్ కు నా డైరెక్ట్ నంబర్ ఇచ్చా. ఏవైనా సమస్యలు వస్తే అతను నాకు డైరెక్ట్ గా కాల్ చేయవచ్చు. నేను కూడా కాల్ చేస్తాను’’ అని ట్రంప్ చెప్పారు. ఈ ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారని ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థ ట్రంప్ ను ప్రశ్నించగా... ఉత్తర కొరియాకు కాల్ చేయనున్నట్టు చెప్పారు.

Donald Trump
kim jhong
  • Loading...

More Telugu News