bangalore: ట్రాఫిక్ తో విసిగిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. గుర్రంపై ఆఫీసుకి వెళ్ళిన వైనం!

  • బెంగళూరులో సిటీ ట్రాఫిక్ రోజురోజుకీ పెరిగిపోతోంది
  • దీనిపై నిరసన తెలిపేందుకే ఈ వినూత్న ఆలోచనా చేశా 
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నా చివరి పని రోజు

ఒకోసారి ఎన్ని గంటలు ముందుగా బయలుదేరినప్పటికీ మనం చేరాల్సిన గమ్యస్థానానికి ట్రాఫిక్ సమస్య కారణంగా సకాలంలో చేరుకోలేం. ముఖ్యంగా, మెట్రో నగరాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉండే వాహనాల రద్దీ  అంతా ఇంతాకాదు. ఇదిలా ఉండగా, ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుర్రమెక్కి తన ఆఫీసుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటన బెంగళూరులో జరిగింది. టిప్ టాప్ గా తయారై, భుజాన బ్యాగ్ తగిలించుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రూపేశ్ కుమార్ వర్మ ఎంచక్కా గుర్రమెక్కి ఆఫీసు ముందు దిగాడు.

‘సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నా చివరి పనిరోజు’ అనే బోర్డు కూడా ఆ గుర్రంపై దర్శనమిచ్చింది. బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇతను ఈ విషయమై మాట్లాడుతూ, సిటీ ట్రాఫిక్ రోజురోజుకీ పెరిగిపోతోందని, దీనిపై నిరసన తెలిపేందుకు ఈ వినూత్న ఆలోచనా చేశానని చెప్పారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నా చివరి పనిరోజు’ అనే కార్డుబోర్డు విషయమై ప్రశ్నించగా.. ఏ కంపెనీలోనూ ఇక తాను ఉద్యోగం చేయనని, అందుకే, బోర్డు ఉంచానని, త్వరలోనే సొంత సంస్థను ప్రారంభిస్తానని రూపేశ్ కుమార్ వర్మ చెప్పడం గమనార్హం.

 గుర్రంపై రూపేశ్ కుమార్ వర్మ ఉన్న చిత్రం ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. కాగా, రూపేశ్ కుమార్ వర్మ సొంత రాష్ట్రం రాజస్థాన్.  

  • Loading...

More Telugu News