Rahul Gandhi: దళిత బాలురను నగ్నంగా నిలబెట్టి కొట్టిన అగ్రకులస్తులు.. వీడియో పోస్ట్ చేసిన రాహుల్‌ గాంధీ

  • అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయడమే వీరు చేసిన తప్పు
  • మానవజాతి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది
  • బీజేపీ, ఆరెస్సెస్ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోంది
  • పోరాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు

మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా వకడి అనే గ్రామంలో ఇటీవల అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దళిత బాలలు.. ఓ అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయగా వారిని పట్టుకున్న కొందరు అగ్రకులస్తులు నగ్నంగా ఊరేగించి, కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ కాలంలోనూ అంటరాని తనం, అస్పృశ్యత ఇంత దారుణంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రాహుల్‌ గాంధీ స్పందిస్తూ... 'ఈ దళిత బాలలు చేసిన ఏకైక తప్పు ఓ అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయడమే.. మానవ జాతి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. బీజేపీ, ఆరెస్సెస్ విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. లేదంటే చరిత్ర మనల్ని క్షమించదు' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News