aadi sai kumar: దర్శకుడిగా మారుతోన్న మరో రచయిత!

  • రచయితగా డైమండ్ రత్నానికి మంచి పేరు 
  • ఆది సాయికుమార్ హీరోగా సినిమా 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు

రచయితలుగా తమ ప్రతిభా పాటవాలను చాటుకుని దర్శకత్వం వైపు వచ్చిన వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ .. కొరటాల శివ ముందు వరుసలో కనిపిస్తారు. ఇద్దరూ కూడా ఎవరి శైలిలో వాళ్లు ప్రేక్షకులను మెప్పిస్తూ .. విజయాలను సొంతం చేసుకుంటూ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇక రీసెంట్ గా రచయిత వక్కంతం వంశీ కూడా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టేసి 'నా పేరు సూర్య'ను తెరకెక్కించాడు.

అదే బాటలో మరో రచయిత అడుగు ముందుకేశాడు .. ఆయనే డైమండ్ రత్నం. కథలను తయారు చేసుకోవడంలోను .. సంభాషణలను అందించడంలోను ఆయనకంటూ ప్రత్యేకమైన స్టైల్ వుంది. అలాంటి డైమండ్ రత్నం తొలిసారిగా మెగాఫోన్ పడుతున్నాడు. ఆది సాయికుమార్ హీరోగా ఆయన ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది.   

aadi sai kumar
  • Loading...

More Telugu News