rajani: మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్?

- విజయ్ మూవీతో బిజీగా మురుగదాస్
- నెక్స్ట్ మూవీ రజనీతో చేయాలనే ఆలోచన
- ఆ దిశగా జరుగుతోన్న ప్రయత్నాలు
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో దర్శకుడిగా మురుగదాస్ కి మంచి క్రేజ్ వుంది. కథా కథనాలను పట్టుగా సిద్ధం చేసుకోవడంలోను .. తెరపై వాటిని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలోను మురుగదాస్ సిద్ధహస్తుడు. అందువలన ఆయన అడగాలేగాని డేట్స్ ఇవ్వని కథానాయకులు అంటూ వుండరు. ఈ కారణంగానే 'స్పైడర్' సినిమా పరాజయంపాలైనా ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ తో చేయగలుగుతున్నాడు.
