allari naresh: పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తానంటోన్న హీరోయిన్

  • భీమనేని దర్శకత్వంలో 'సిల్లీ ఫెలోస్'
  • హీరోలుగా అల్లరి నరేశ్ .. సునీల్ 
  • కథానాయికగా చిత్రా శుక్లా  

తెలుగు తెరను ఈ మధ్యకాలంలో పలకరించిన అందమైన కథానాయికలలో 'చిత్రా శుక్లా' ఒకరు. ఇటీవల ఆమె చేసిన 'రంగుల రాట్నం' సినిమా పెద్దగా ఆడకపోయినా, గ్లామర్ పరంగా యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆ కారణంగానే ఆమెకి 'సిల్లీ ఫెలోస్' సినిమాలో ఛాన్స్ వచ్చింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేశ్ .. సునీల్ ప్రధాన పాత్రలుగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న 'చిత్రా శుక్లా' మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. ఈ తరహా పాత్రను పోషించడం నాకు ఇదే మొదటిసారి. అందువలన గతంలో రేఖ .. టబు పోలీస్ ఆఫీసర్స్ గా చేసిన సినిమాలు చూశాను. ఆ రిఫరెన్స్ నాకు బాగా ఉపయోగపడుతోంది. కామెడీని పండించడంలో అల్లరి నరేశ్ .. సునీల్ శైలి చాలా భిన్నంగా అనిపిస్తోంది .. నటన పరంగా కొత్త విషయాలను నేర్చుకోవడానికి నాకు మంచి అవకాశం లభించింది" అని చెప్పుకొచ్చింది.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News