BSNL: బీఎస్ఎన్ఎల్ రంజాన్ బంపరాఫర్... రూ.786తో ఐదు నెలల పాటు రోజుకు 2 జీబీ!

  • అపరిమిత వాయిస్ కాల్స్, రోమింగ్ ఉచితం
  • రోజుకు 2 గిగాబైట్ల డేటా
  • 26వ తేదీలోగా రీచార్జ్ చేసుకుంటేనే

రంజాన్ పర్వదినం సందర్భంగా తన కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్ ప్రకటించింది. సరికొత్త స్పెషల్ టారిఫ్ ఓచర్ ను విడుదల చేస్తున్నామని తెలిపింది. రూ. 786తో రీచార్జ్ చేసుకుంటే, 150 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని, రోమింగ్ ఉచితమని, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చని, రోజుకు 2 గిగాబైట్ల 3జీ లేదా 4జీ డేటాను కూడా అందిస్తామని తెలిపింది.

ఢిల్లీ, ముంబై టెలికం సర్కిళ్లలోనూ ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తామని పేర్కొంది. ఈనెల 26లోగా చేసుకునే రీచార్జ్ లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఇటీవల ఫుట్ బాల్ ప్రియుల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సౌకర్యం లేకుండా రోజుకు 4 జీబీ డేటాను ఇస్తూ ఓ ఎస్టీవీని సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ ఆకర్షణీయమైన ప్యాక్ ల కారణంగా ఇతర టెలికం నెట్ వర్క్ ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల మంది ఎంఎన్పీ తీసుకుని ఇతర నెట్ వర్క్ ల నుంచి వచ్చారని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

BSNL
STV
Rs.786
2 GB per Day
Unlimited Voice Calls
  • Loading...

More Telugu News