balakrishna: బాలయ్య కోసం మరో పవర్ ఫుల్ స్టోరీ రెడీ

  • 'జై సింహా'కి కథ అందించిన రత్నం
  • ఆ సినిమా సూపర్ హిట్ 
  • మరో కథను రెడీ చేసిన రత్నం    

మొదటి నుంచి కూడా బాలకృష్ణకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందువలన ఆయన వాళ్లకి నచ్చే కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళుతుంటాడు. అలా ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య సినిమాగా 'జై సింహా' కనిపిస్తుంది. ఈ సినిమాకి కథ .. మాటలను ఎం.రత్నం అందించారు. బాలకృష్ణ సినిమాకి కథ ఎలా ఉండాలి .. ఏయే సందర్భాల్లో ఆయన చెప్పే డైలాగ్స్ ఏ స్థాయిలో ఉండాలనే విషయం రత్నానికి బాగా తెలుసు.

అందువలన బాలకృష్ణ కూడా ఆయన కథల పట్ల ఆసక్తిని చూపుతుంటారు. బాలకృష్ణ కోసం కొంతకాలంగా ఓ కథపై కసరత్తు చేస్తూ వచ్చిన రత్నం, తాజాగా ఆ కథను పూర్తి చేశాడట. త్వరలోనే బాలకృష్ణకి వినిపించడానికి సిద్ధమవుతున్నట్టుగా ఆయన చెప్పాడు. ఈ కథ బాలకృష్ణకి నచ్చితే, ఆయన బోయపాటితో చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.   

  • Loading...

More Telugu News