jagan padayatra: 190వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర.. నీరాజనం పలుకుతున్న అభిమానులు

  • ఆత్రేయపురం నుంచి ప్రారంభమైన నేటి యాత్ర
  • మెర్లపాలెంలో భోజన విరామం
  • రావులపాలెంలో ముగియనున్న నేటి పాదయాత్ర

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 190వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం నుంచి ఆయన తన పాదయాత్రను కొనసాగించారు.

 ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు జగన్ కు నీరాజనం పలికారు. ఆయన అడుగులో అడుగు వేస్తూ, ముందుకు కదిలారు. ఈ రోజు పాదయాత్ర ఆత్రేయపురం నుంచి కట్టుంగ క్రాస్ రోడ్డు,లొల్ల, వాడపల్లి మీదుగా మెర్లపాలెం చేరుకుంటుంది. అక్కడ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఊబలంక మీదుగా రావులపాలెం వరకు యాత్ర కొనసాగుతుంది. జగన్ కు తమ సమస్యలను విన్నవించుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. 

jagan padayatra
190 days
  • Loading...

More Telugu News