Arvind Kejriwal: మోదీ గారూ.. మీరైనా జోక్యం చేసుకోండి: కేజ్రీవాల్

  • నాలుగో రోజుకు చేరుకున్న కేజ్రీవాల్ ధర్నా
  • మూడు నెలలుగా సమావేశాలకు హాజరు కాని అధికారులు
  • కుంటుపడుతున్న అభివృద్ధి

డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ బృందం చేపట్టిన ధర్నా గురువారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల సమ్మె విరణమకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తమతో మాట్లాడడానికి ఎల్‌జీ అనిల్ బైజల్‌కు నాలుగు నిమిషాల సమయం లేకుండా పోయిందని ఆప్ నేతలు ఎద్దేవా చేశారు.

మరోవైపు డిమాండ్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్‌లతోపాటు సీఎం కేజ్రీవాల్‌కు గురువారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మూడు నెలలుగా మంత్రులు నిర్వహిస్తున్న సమావేశాలకు అధికారులు హాజరు కావడం లేదని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించేందుకు ఎల్‌జీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అందులో ఆరోపించారు.  ఐఏఎస్‌ల సమ్మె కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News