Nawaz Sharif: నవాజ్ షరీఫ్ భార్యకు గుండెపోటు... పరిస్థితి విషమం!

  • గత రాత్రి విమానంలో గుండెపోటు
  • ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు
  • వెంటిలేటర్ పై కుల్సూమ్

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ నవాజ్ కు తీవ్రమైన గుండెపోటు రాగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆమెకు గురువారం రాత్రి గుండెపోటు వచ్చిందని 'జియో న్యూస్' వెల్లడించింది. ఆసుపత్రికి తీసుకు వెళ్లేసరికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్ పై ఉంచి, లైఫ్ సపోర్ట్ మెషీన్ సాయంతో శ్వాసను అందిస్తున్నారని తెలిపింది.

కాగా, కుల్సూమ్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె మర్యామ్ నవాజ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, అకస్మాత్తుగా ఆమెకు గుండె పోటు వచ్చిందని, ఆ సమయంలో తాము విమానంలో ఉన్నామని, ఆమె వేగంగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థించాలని కోరింది. వచ్చేనెల 25న జరిగే పాకిస్థాన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో మర్యామ్ నవాజ్ పోటీ పడనున్నారన్న సంగతి తెలిసిందే.

Nawaz Sharif
Khulsoom
Heart Attack
London
ICU
  • Loading...

More Telugu News