Chandrababu: వాళ్లిద్దరి భేటీ సమాచారం తెలిసి ఓ నవ్వు నవ్విన చంద్రబాబు!

  • మోత్కుపల్లిని కలిసిన విజయసాయిరెడ్డి
  • చంద్రబాబుకు చేరిన సమాచారం
  • దీనిపై స్పందనగా చంద్రబాబు ఓ నవ్వు నవ్వారట

టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై మోత్కుపల్లి దుమ్మెత్తి పోశారు. బాబుపై ఆరోపణలు, విమర్శలు చేశారు. చంద్రబాబును రాజకీయాల నుంచి తరిమికొట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.

కాగా, మోత్కుపల్లి-విజయసాయిరెడ్డి భేటీ సమాచారం చంద్రబాబుకు చేరింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు.. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నట్టు టీడీపీ వర్గాల సమాచారం. కాగా, ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రత్యేకహోదా రాదని, జగనో, పవనో ముఖ్యమంత్రి అయితేనే హోదా వస్తుందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.  

Chandrababu
mothkpalli
vijaya sai reddy
  • Loading...

More Telugu News