Chandrababu: నువ్వు పవన్ కల్యాణ్ ని వాడుకుని వదిలెయ్యలేదా?: మోత్కుపల్లి

  • నాడు పవన్ కల్యాణ్ ఇంటికి నువ్వు వెళ్లావా? నీ ఇంటికి ఆయనొచ్చాడా?
  • గెలిచిన తర్వాత పవన్ ని బయటపడేశావు
  • ఇది న్యాయమా?

టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి ఈ రోజు చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. 'నేను ఇలా మాట్లాడటానికి కారణం నువ్వే (చంద్రబాబు). మహానాడుకు నన్ను ఆహ్వానిస్తే ఈ విషయాలన్నీ లోపలే మాట్లాడేవాడిని. నేను ఎవరికీ అమ్ముడుపోయే మనిషిని కాదు. నేను అనుకున్నది సాధించే వరకు పోరాటం చేసే మనిషినని నీకు తెలుసు. నువ్వు దొరకని దొంగవు. నీ పేరు మోసగాడు. నమ్మే వాళ్లను గొంతు కోసే నమ్మకద్రోహి నీ పేరు. ఆ రోజున ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేను ఏడిస్తే నువ్వు ఫోన్ ఎందుకు చేయలేదు?' అంటూ ప్రశ్నించారు మోత్కుపల్లి.

'ఒక వ్యవస్థనే సృష్టించినటువంటి సృష్టికర్తను చంపిన నరహంతకుడివి నువ్వు. నువ్వు పవన్ కల్యాణ్ ని వాడుకుని వదిలెయ్యలేదా? నాడు పవన్ కల్యాణ్ ఇంటికి నువ్వు వెళ్లావా? నీ ఇంటికి పవన్ కల్యాణ్ వచ్చాడా? గెలిచిన తర్వాత పవన్ ని బయటపడేశావు. ఇది న్యాయమా? నాడు ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పవన్ ని పిలిచారు. ఏదైనా పదవి కావాలా? అని కూడా పవన్ ని అడిగారు. ఏ పదవీ పవన్ కల్యాణ్ తీసుకోలేదు. ఈ విషయాన్ని ప్రశంసించాలి కదా!’ అన్నారు.

Chandrababu
mothkpalli
  • Loading...

More Telugu News