anasuya: మా ఆయనను మొదటిసారి ఎన్‌సీసీ క్యాంప్‌లో కలిశాను: అనసూయ

  • ట్విట్టర్‌లో అభిమానులతో హాట్‌ యాంకర్‌ ముచ్చట
  • ఓపికగా సమాధానాలు చెప్పిన అనసూయ
  • భరద్వాజ్‌ను మొదటిసారి ఎక్కడ కలిశారని అభిమాని ప్రశ్న

యాంకర్‌, సినీనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఇటీవల 'రంగస్థలం' సినిమాలో నటించి మరింత క్రేజ్‌ సంపాదించింది. ప్రస్తుతం ఆమె మరికొన్ని సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె తాజాగా ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

నెటిజన్‌: హాయ్‌ మేడమ్‌.. రంగస్థలంలో మీ పాత్ర చాలా బాగుంది. మీ వయసుకి పెద్ద పాత్ర కదా మీరు ఇబ్బంది పడలేదా?
అనసూయ: నిజంగా చెబుతున్నా.. ముందు ఇబ్బంది పడ్డాను. కానీ, ఒక్కసారి ఒప్పుకున్నాక నేను వెనుదిరిగి చూసే టైప్‌ కాదు. నా భయం అంతా డబ్బింగ్‌ చెప్పేటప్పుడు పోయింది.

మీ ట్విట్టర్‌ డీపీ ఎప్పుడు మార్చుతున్నారు?
ఎందుకు?

ఒక్కసారి కోలీవుడ్‌ ఫ్యాన్స్‌కి హాయ్‌ చెబుతారా?
హాయ్‌

మీ భర్త భరద్వాజ్‌ను మొట్టమొదటి సారి ఎక్కడ కలిశారు?
ఒక ఎన్‌సీసీ క్యాంప్‌లో

ఒకవేళ ఇదే మీ జీవితంలో ఆఖరి రోజయితే ఏం చేస్తారు?
కుటుంబ సభ్యులతో గడుపుతాను

మీరు దేవుడిని నమ్ముతారా?
నమ్ముతాను

మీ బెస్ట్‌ క్రిటిక్‌ ఎవరు?
నా భర్త

మా ప్రొద్దుటూరు ఎప్పుడు వస్తున్నారు?
మీరు ఎప్పుడు పిలుస్తున్నారు?

 తారక్‌ నటించిన మీ ఫేవరేట్ మూవీ?

రాఖీ, బృందావనం, అదుర్స్‌, నాన్నకు ప్రేమతో, జై లవకుశ

  మహేశ్‌ బాబు నటించిన మీ ఫేవరేట్ మూవీ ఏమిటి?
చాలా ఉన్నాయి.. మురారీ అన్నింటికంటే ఇష్టం.

anasuya
ncc
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News