Govinda: 'డ్యాన్సింగ్ అంకుల్'తో కలసి స్టెప్పేసిన గోవిందా!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-a9602d867412b06faf879c3b71215f8861d5985e.jpg)
- బంధువు వివాహంలో సంజీవ్ శ్రీవాత్సవ డ్యాన్స్
- సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే సెలబ్రిటీ
- ఓ డ్యాన్స్ షోలో గోవిందాతో కలసి నృత్యం
సోషల్ మీడియా పుణ్యమాని గత నెలలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 'డ్యాన్సింగ్ అంకుల్' గుర్తున్నాడా? ఓ మ్యారేజ్ ఫంక్షన్ లో అచ్చు బాలీవుడ్ నటుడు గోవిందా మాదిరిగా ఆయన చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. దీంతో సంజీవ్ శ్రీవాత్సవ అనే ఈ అంకుల్ ఓ సెన్సేషన్ గా మారిపోయాడు. తాజాగా, 'డాన్స్ దివానే' సెట్స్ పై తన అభిమాన నటుడు గోవిందాను సంజీవ్ కలుసుకోగా, ఇద్దరూ కలసి వేదికపై స్టెప్పులేశారు. గోవిందాను అభిమానించే తనకు, ఆయనతో స్టేజ్ పంచుకునే అవకాశం లభిస్తుందని ఎన్నడూ భావించలేదని ఈ సందర్భంగా సంజీవ్ వ్యాఖ్యానించారు. తన భార్యతో కలసి ఈ షోకు గెస్టుగా సంజీవ్ వెళ్లగా, షో న్యాయనిర్ణేతలుగా ఉన్న మాధురీ దీక్షిత్, తుషార్ కాలియా, శశాంక్ ఖైతాన్ లు సైతం గోవిందా, సంజీవ్ డ్యాన్స్ చూసి ఆనందించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-3e6d5496380b15046f9ffa450e98d8ff2dc12701.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-cdb51f0c913efa48032666d0934d770eb655483d.jpg)
(Pic Courtesy: Yogen Shah)