Pawan Kalyan: తిరుపతిలో పవన్ ఫ్యాన్స్ పంచాయితీ!

  • సురేష్, కిరణ్ రాయల్ మధ్య చానాళ్లుగా విభేదాలు
  • తనపై సురేష్ దాడి చేశాడంటున్న కిరణ్
  • పోలీసులకు ఫిర్యాదు

తిరుపతిలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య నెలకొన్న గొడవ, పోలీసుల వరకూ వెళ్లింది. నగరంలో పవన్ అభిమాన సంఘాలను నిర్వహిస్తున్న సురేష్, కిరణ్ రాయల్ అనే యువకుల మధ్య చానాళ్ల నుంచి విభేదాలు ఉన్నట్టు తెలుస్తుండగా, ఇప్పుడవి మరింతగా పెరిగాయి. తనపై కిరణ్ దాడి చేశాడని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో సురేష్ ఫిర్యాదు చేయగా, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

కిరణ్ రాయల్ ఎన్నో ఆగడాలు చేస్తున్నాడని, తనపై తప్పుడు కేసులు పెట్టిన అతనిపై పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేస్తానని సురేష్ వెల్లడించాడు. పోలీసులను కలిసి వాస్తవాలను తెలియజేస్తానని అన్నాడు. కాగా, సినిమాల విడుదల సమయంలో టికెట్ల పంపిణీ, ప్లెక్సీల ఏర్పాటు తదితరాంశాల్లో వీరి బృందాలు గొడవలు పడుతూ ఉండేవారని తెలుస్తోంది. 

Pawan Kalyan
Tirupati
Fans
Suresh
Kiran
  • Loading...

More Telugu News