kumaraswamy: కర్ణాటక ప్లానింగ్ బోర్డు చీఫ్‌గా ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి!

  • కుమారస్వామి మరో సంచలన నిర్ణయం
  • 6న నారాయణమూర్తిని కలిసి చర్చలు
  • ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచే ప్రయత్నమన్న సీఎం

రాష్ట్ర ప్రణాళిక మండలి చీఫ్‌గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తిని నియమించాలని  కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న నారాయణమూర్తిని ఆయన నివాసంలోనే కలిసిన కుమారస్వామి ఈ విషయమై చర్చించారు. బుధవారం కుమారస్వామి మాట్లాడుతూ.. నారాయణమూర్తిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు (డిప్యూటీ చైర్మన్)గా నియమించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందని చెప్పారు. అలాగే పెట్టుబడులను కూడా ఆకర్షించవచ్చని పేర్కొన్నారు. మరికొందరిని కూడా సభ్యులుగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం కుమారస్వామి తెలిపారు.

kumaraswamy
Karnataka
Narayanmuthy
Infosys
  • Loading...

More Telugu News