iftar: రాహుల్‌ గాంధీ ఇఫ్తార్‌ విందు.. హాజరైన ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌

  • ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో విందు
  • హాజరైన ప్రముఖులు
  • మరోవైపు కొనసాగుతోన్న బీజేపీ నేతల ఇఫ్తార్ విందు

ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇఫ్తార్‌ విందు ఇస్తున్నారు. ఈ విందుకి మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ హాజరయ్యారు. వారితో పాటు పలు పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ఈ విందుకి రాహుల్‌ గాంధీ దేశంలోని 17 పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా 2015లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.
             
కాగా, కేంద్ర మంత్రి అబ్బాస్‌ నఖ్వీ కూడా ఢిల్లీలో ట్రిపుల్‌ తలాక్‌ బాధితులకు ఇఫ్తార్‌ విందు ఇస్తున్నారు. ఇందులో కేంద్రమంత్రి స్మృతి ఇరాని కూడా పాల్గొన్నారు. మరోవైపు భోపాల్‌లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇస్తున్నారు.

iftar
Rahul Gandhi
Pranab Mukherjee
  • Error fetching data: Network response was not ok

More Telugu News