ntr: కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ మూవీ!

  • త్రివిక్రమ్ తో సెట్స్ పై ఎన్టీఆర్ 
  • త్వరలో రాజమౌళి ప్రాజెక్ట్ 
  • ఆ తరువాత కల్యాణ్ రామ్ బ్యానర్లో  

కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా కొంతకాలం క్రితం చేసిన 'జై లవ కుశ ' భారీ విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోయిన ఈ సినిమా, కల్యాణ్ రామ్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో మళ్లీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నట్టు తాజాగా కల్యాణ్ రామ్ చెప్పాడు."ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నేను హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాం. ఆ తరువాత సినిమా ఎన్టీఆర్ తో ఉంటుంది" అని కల్యాణ్ రామ్ అన్నాడు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. అందువలన కల్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.   

  • Loading...

More Telugu News