vijay devarakonda: విజయ్ దేవరకొండ జోడీగా సాయిపల్లవి?

  • సాయిపల్లవి నాయికగా 'పడి పడి లేచె మనసు'
  • వేణు ఊడుగుల దర్శకత్వంలోను ఓ సినిమా 
  • క్రాంతిమాధవ్ తోను సెట్స్ పైకి    

తెలుగు ప్రేక్షకులను 'ఫిదా'తో పలకరించిన సాయిపల్లవి, ఆ తరువాత 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'తో మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ తో 'పడి పడి లేచే మనసు' సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. 'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలోను ఒక సినిమా చేయడానికి ఆమె అంగీకరించింది. రేపో మాపో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాతో పాటు ఆమె క్రాంతిమాధవ్ కి కూడా ఓకే చెప్పేసిందనేది తాజా సమాచారం. 'ఓనమాలు' .. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలతో దర్శకుడిగా క్రాంతిమాధవ్ మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన తన తాజా చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. హీరో .. హీరోయిన్లకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

vijay devarakonda
saipallavi
  • Loading...

More Telugu News