Rahul Gandhi: ఎల్కే అద్వానీని పట్టించుకోని మోదీ వీడియోను పోస్ట్ చేసిన రాహుల్‌ గాంధీ

  • గురువు కోరికను ఏకలవ్యుడు తీర్చాడు
  • తన కుడి బొటన వేలిని ఇచ్చాడు
  • కానీ, బీజేపీ మాత్రం తమ గురువులను దూరం పెట్టింది 
  • ఇలా చేయడమే మన సంస్కృతిని రక్షించడమని మోదీ భావన

బీజేపీ సీనియర్‌ నేత ఎల్కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవం ఇవ్వట్లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ కంటే తమ పార్టీయే ఆయనను ఎక్కువ గౌరవిస్తోందని ముంబయిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌ అన్నారు. తాజాగా, ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ మరోసారి ఇదే విషయంపై విమర్శలు గుప్పించారు.

గురువు కోరిక మేరకు ఏకలవ్యుడు తన కుడి బొటన వేలిని ఇచ్చాడని, కానీ, బీజేపీ మాత్రం తమ గురువులను దూరం పెట్టిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, జస్వంత్‌ సింగ్‌ వంటి వారి కుటుంబాలను అవమాన పరచడమే భారతీయ సంస్కృతిని రక్షించడమని మోదీ భావిస్తున్నారని రాహుల్‌ ఎద్దేవా చేశారు.      

Rahul Gandhi
Narendra Modi
lk advani
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News