bsnl data offet: బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్... రూ.149కే.. 28 రోజుల పాటు.. రోజూ 4జీబీ డేటా

  • 28 రోజుల వ్యాలిడిటీ
  • ఫిఫా వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ప్లాన్
  • కొత్త ఖాతాదారులను ఆకర్షించే ప్రయత్నం 

బీఎస్ఎన్ఎల్ మరో కొత్త ఆఫర్ తెచ్చింది. తాజాగా రూ.149 రీచార్జ్ తో కూడిన ఫిఫా వరల్డ్ కప్ స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. ఎస్టీవీ 149తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ప్రతిరోజూ 4జీబీ డేటాను పొందొచ్చు. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలోనూ ఈ ప్లాన్ అమల్లో ఉంటుంది. అయితే, ఎటువంటి వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ సౌకర్యం ఇందులో లేదు. చందాదారులను కాపాడుకోవడంతోపాటు, కొత్తవారిని సొంతం చేసుకునేందుకు కంపెనీలు తంటాలు పడుతున్నాయి. 

bsnl data offet
stv149
  • Loading...

More Telugu News