Chandrababu: సమావేశాన్ని వాయిదా వేయండి: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు చంద్రబాబు లేఖ

  • 16న రంజాన్, 17 ఉదయం ఈద్ మిలాప్ ఉన్నాయి
  • నేను అమరాతిలో ఉండాల్సిన అవసరం ఉంది
  • రాజీవ్ కుమార్ కు చంద్రబాబు లేఖ

ఈ నెల 17 ఉదయం జరగాల్సిన నీతి ఆయోగ్ గవర్నింగ్ సమావేశాన్ని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఒకవేళ వీలుకాని పక్షంలో కనీసం 17వ తేదీ సాయంకాలానికైనా వాయిదా వేయాలని విన్నవించారు. నీతి ఆయోగ్ 4వ సమావేశాలను తాను స్వాగతిస్తున్నానని... అయితే, 16వ తేదీన రంజాన్, 17 ఉదయం ఈద్ మిలాప్ కార్యక్రమాలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో, తాను 17 ఉదయం కూడా అమరావతిలో ఉండాల్సిన అవసరం ఉందని, అందుకని సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు.  

Chandrababu
niti ayog
letter
  • Loading...

More Telugu News