Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. భద్రత కట్టుదిట్టం

  • సల్మాన్ హత్యకు బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర
  • ఇప్పటికే రెక్కీ నిర్వహించిన సంపత్ నెహ్రా
  • అలెర్ట్ అయిన ముంబై పోలీసులు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. సల్మాన్ ను చంపేందుకు ప్లాన్ చేశామంటూ సంపత్ నెహ్రా అనే గ్యాంగ్ స్టర్ వెల్లడించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సల్మాన్ నివాసం వద్ద సంపత్ రెక్కీ కూడా నిర్వహించాడని ముంబై పోలీసులకు హర్యాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమాచారం అందించింది. సంపత్ నెహ్రాను హైదరాబాదులోని మియాపూర్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ కు చెందిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో సంపత్ షార్ప్ షూటర్ గా పేరుగాంచాడు. నిన్ను చంపేస్తామంటూ సల్మాన్ కు ఈ గ్యాంగ్ నుంచి జనవరిలో బెదిరింపులు వచ్చాయి.

Salman Khan
murder
plan
security
bollywood
  • Loading...

More Telugu News