Rahul Gandhi: మోదీ కొద్ది మంది వ్యాపారులనే చూసుకుంటున్నారు... మిగతా వారిని పట్టించుకోవట్లేదు: రాహుల్

  • పెట్రోల్ పై అదనపు సొమ్ముతో వ్యాపారులకు బెయిలవుట్
  • పెట్రోల్, మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు చేర్చరు?
  • ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో కలసికట్టుగా పోరాటం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకున్నారు. పెట్రోల్ ధరలు సహా పలు అంశాలపై ప్రధాని మోదీపైన, ఎన్డీయే సర్కారుపైన విమర్శలు కురిపించారు. ‘‘మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో (యూపీఏ 1, 2) చమురు ధరలు బ్యారెల్ కు 140 డాలర్లకు చేరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. కానీ, ఈ రోజు చమురు ధరలు బ్యారెల్ కు 70 డాలర్ల వద్దే ఉన్నాయి. అదనంగా వచ్చే డబ్బులను కొందరు వ్యాపారులకు బెయిలవుట్ కోసం వినియోగిస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం సంపన్న వ్యాపారుల కోసమే తప్పితే సామాన్యుల కోసం పనిచేయడం లేదని విమర్శించారు.

జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం, మద్యం ఉత్పత్తులను ఎందుకు తీసుకురావడం లేదని రాహుల్ ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయని చెప్పారు. దేశ రాజ్యాంగం, పలు ఇతర సంస్థల్లో జోక్యం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో అన్ని కీలకమైన సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి ప్రమాదంలో పడ్డాయి. దీన్ని వ్యతిరేకించేందుకు భావసారూప్య పార్టీలను ఒక్కటి చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది’’ అని రాహుల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో భారీగా నష్టపోయింది చిన్న, మధ్య తరహా సంస్థలు, పేద ప్రజలేనన్నారు.

  • Loading...

More Telugu News