Karnataka: జయనగర్ కౌంటింగ్ చివర్లో టెన్షన్... చివరికి సుమారు మూడు వేల మెజారిటీతో గెలిచిన సౌమ్యా రెడ్డి

  • తొలుత 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సౌమ్యా రెడ్డి
  • చివరి రౌండ్లలో తగ్గిన మెజారిటీ
  • సుమారు 4 వేల ఓట్ల మెజారిటీతో విజయం
  • ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ శ్రేణులు

కర్ణాటకలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ పడ్డ మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తొలుత 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలోకి వెళ్లిన సౌమ్యారెడ్డికి, ఆపై రౌండ్లలో మెజారిటీ తగ్గుతూ రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కనిపించింది.

చివరకు ఏమవుతుందా? అన్న టెన్షన్ నెలకొనగా, ఇంటికి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్ తిరిగి కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు కూడా. చివరకు సుమారు 4 వేల ఓట్ల మెజారిటీతో సౌమ్యా రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో కర్ణాటక కాంగ్రెస్ ఖాతాలోకి మరో సీటు వచ్చి చేరినట్లయింది.

Karnataka
Jayanagar
By-polls
Soumya Reddy
Congress
BJP
  • Loading...

More Telugu News