sudheer babu: 'సమ్మోహనం'లో సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి!: సుధీర్ బాబు

- సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం'
- కథానాయికగా అదితీరావు
- ఈ నెల 15వ తేదీన విడుదల
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు .. అదితీరావు జంటగా 'సమ్మోహనం' చిత్రం రూపొందింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ .. "మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి ఎప్పుడో పనిచేయవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు.
