Fitness Challenge: కర్ణాటక సీఎం కుమారస్వామిని చాలెంజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!

  • విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ సవాల్ ను స్వీకరించిన మోదీ
  • తన ఎక్సర్ సైజ్ ల వీడియోను పోస్టు చేసిన మోదీ
  • ఐఏఎస్ అధికారులకూ సవాల్ ను ఫార్వార్డ్ చేసిన మోదీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన ఫిట్ నెస్ సవాలును స్వీకరించి, తాను ఎక్సర్ సైజ్ లు చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్టు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, తన ఫిట్ నెస్ చూపాలని సవాల్ విసిరారు. ఆయనతో పాటు కామన్వెల్త్ క్రీడల పతక విజేత మోనికా బాత్రా, 40 ఏళ్ల వయసు దాటిన ధైర్యశాలురైన ఐపీఎస్ అధికారులనూ చాలెంజ్ చేశారు. ఇక తన ఫిట్ నెస్ వీడియోలో పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంలతో మమేకమైతే ఎంతో ప్రేరణ పొందవచ్చని, ఆపై ఉత్సాహంగా రోజు సాగుతుందని మోదీ వ్యాఖ్యానించారు. వీటికి యోగా తోడైతే మరింత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చని అన్నారు. మోదీ వీడియోను మీరూ చూడవచ్చు.

Fitness Challenge
Virat Kohli
Narendra Modi
Kumaraswamy
  • Error fetching data: Network response was not ok

More Telugu News