Karnataka: కర్ణాటక జయనగర్ ఉప ఎన్నిక... బీజేపీకి పనిచేయని సింపతీ... కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం!

  • బీజేపీ అభ్యర్థి మరణంతో ఉప ఎన్నిక
  • నేడు మొదలైన కౌంటింగ్
  • తొలిరౌండ్ లో సౌమ్యారెడ్డి ఆధిక్యం

బెంగళూరు పరిధిలోని జయనగర్ కు జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం కాగా, తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యరెడ్డి ఆధిక్యంలో నిలిచారు. గత నెలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి బిఎన్‌ విజయ్‌ కుమార్‌ హఠాన్మరణం చెందడంతో, ఈ నియోజకవర్గానికి ఎన్నిక వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

బిఎన్‌ విజయ్‌ కుమార్‌ సోదరుడు బిఎన్‌ ప్రహ్లాద్‌ ను బీజేపీ తమ అభ్యర్థిగా రంగంలోకి దింపగా, కాంగ్రెస్‌ అభ్యర్థిని సౌమ్యారెడ్డిని బలపరుస్తూ తమ అభ్యర్థిని జేడీఎస్‌ ఉపసంహరించుకుంది. ఈ నియోజకవర్గంలో ప్రహ్లాద్ వైపు ఓటర్ల సింపతీ పవనాలు వీస్తాయని బీజేపీ భావించగా, తొలి ట్రెండ్స్ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం.

Karnataka
Bengalore
Jayanagar
By-poll
Soumya Reddy
  • Loading...

More Telugu News