Uttar Pradesh: యూపీలో డివైడర్ ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు... 16 మంది దుర్మరణం!

  • యూపీలోని మణిపూర్ సమీపంలో దారుణం
  • వేగంగా వస్తూ అదుపుతప్పిన బస్సు
  • 12 మందికి తీవ్ర గాయాలు

మితిమీరిన వేగంతో వస్తూ అదుపుతప్పిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టడంతో 16 మంది దుర్మరణం పాలైన ఘటన ఈ తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని మణిపూర్ సమీపంలో జరిగింది. దన్హారా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి, క్షతగాత్రులను సమీపంలోని అసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రమాదం గురించిన సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, అతి వేగమే కారణమని తెలుస్తోందని పోలీసులు తెలిపారు.

Uttar Pradesh
Manipur
Road Accident
Death
  • Loading...

More Telugu News