Arman Kohli: బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ అరెస్ట్!

  • సహజీవన భాగస్వామిపై అర్మాన్ దారుణం
  • నీరూ రంధావాను కొట్టిన అర్మాన్
  • గత వారంలో ఘటన - తాజాగా అరెస్ట్

తన సహజీవన భాగస్వామి, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసిన శాంతాక్రజ్ పోలీసులు, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు.

ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నీరూ రంధావాకు బలమైన గాయాలు కాగా, కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నీరూ వ్యాఖ్యానించారు. కాగా, నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

Arman Kohli
Neeru Randhawaa
Arrest
Mumbai
Police
  • Loading...

More Telugu News