Andhra Pradesh: నైరుతికి తోడైన అల్పపీడనం... ఇక మస్తు వానలే!

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రెండు మూడు రోజుల పాటు వర్షాలు
  • హెచ్చరించిన వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాలపై పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలకు అల్పపీడనం తోడైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణల్లో వచ్చే రెండు మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనా వేశారు. ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉందని తెలిపారు. దీని కదలికలను గమనిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News