Prakash Raj: విద్య వ్యాపారమైంది.. దత్తత తీసుకోండి ప్లీజ్: నటుడు ప్రకాశ్ రాజ్ పిలుపు

  • ఒక్కో నటుడు ఒక్కో పాఠశాలను దత్తత తీసుకోవాలి
  • దేశంలోని 70 శాతం గ్రామాల్లో విద్య అందని ద్రాక్షే
  • దత్తత ద్వారా మార్పు సాధ్యమే

సామాజిక సమస్యలపై స్పందించడంలో ముందుండే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా మరోమారు స్పందించారు. దేశంలో విద్యావ్యవస్థ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా దేశంలోని 70 శాతం గ్రామాల్లో విద్య అందని ద్రాక్షగానే మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ బాలలకు నాణ్యమైన విద్య అందడం లేదన్న ఆయన దీనికి పరిష్కారం కూడా సూచించారు.

ప్రతీ నటుడు, జాతీయ స్థాయి క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో ఒక్కో పాఠశాలను దత్తత తీసుకోవాలని ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, మూడు నెలలకోసారి సందర్శిస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. కాగా, కర్ణాటకలోని మేణసగెరె గ్రామంలోని ఓ పాఠశాలను ఇప్పటికే దత్తత తీసుకున్న ప్రకాశ్ రాజ్, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన విద్య కోసం కృషి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News