Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని వాజ‌పేయి ఆరోగ్యం మరింత విషమం!

  • ఆసుపత్రి నుంచి బయటకు రాని బులెటిన్
  • ఆరోగ్యంపై ఊహాగానాలు
  • పలువురు ప్రముఖుల పరామర్శ

మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం మరింత విషమించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ మీడియా అధికారి చెప్పినప్పటికీ, వాస్తవానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఎయిమ్స్ నుంచి ఎటువంటి బులెటిన్ విడుదల కాకపోవడం ఇందుకు ఊతమిస్తోంది.

వాజ్‌పేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా, మంగళవారం మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అశ్విన్‌ కుమార్‌ చౌబే, సాధ్వీ నిరంజన్‌ జోషి, అనంత్‌ గీతే, మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి తదితరులు ఆసుపత్రికి వచ్చి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్ ట్వీట్ చేస్తూ.. వాజ్‌పేయి ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

Atal Bihari Vajpayee
BJP
New Delhi
Manmohan singh
  • Loading...

More Telugu News