bangalore: ఆటగాళ్ల భోజనంలో పురుగులపై స్పందించిన సాయ్ డైరెక్టర్

  • సాయ్ ప్రాంతీయ డైరెక్టర్లతో అత్యవసర సమావేశం 
  • నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశాలు 
  • సమస్య పరిష్కారం కోసం కృషి  

బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) లో ఆటగాళ్లకు అందిస్తున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని భారత పురుషుల హాకీ జట్టు కోచ్ హరీంద్ర సింగ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సాయ్ డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్ స్పందించారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సాయ్ ప్రాంతీయ డైరెక్టర్లతో అత్యవసర సమావేశమయ్యామని, నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు.

ఈ విషయమై ఇకపై ఫిర్యాదులు వస్తే ప్రాంతీయ డైరెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేంద్రంలో ఆహారం పరిశుభ్రంగా లేదన్నవిషయం మార్చిలోనే వెలుగు చూసిందని, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని, కొత్త వంటవాడిని తీసుకుంటామని, ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

bangalore
less quality meals
  • Loading...

More Telugu News