ongole dairy: ‘ఒంగోలు డెయిరీ’ పునరుద్ధరణకు చంద్రబాబు ఆదేశాలు

  • డెయిరీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తాం
  • రైతులు, డెయిరీ ఉద్యోగులు బకాయిలు చెల్లించాలి
  • ఈ మేరకు మంత్రి శిద్ధా రాఘవరావు, అధికారులకు ఆదేశాలు

ఒంగోలు డెయిరీ పునరుద్ధరణకు ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు చేప్టటారు. రైతులు, డెయిరీ ఉద్యోగులు బకాయిలు చెల్లించి, డెయిరీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తామని చెప్పారు. డెయిరీ పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టాలని ఈ మేరకు మంత్రి శిద్ధా రాఘవరావు, అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

 కాగా, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు డెయిరీ గత రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అయినప్పటికీ ఏదో విధంగా నెట్టుకొట్టుస్తోంది. ఈ డెయిరీలో రూ.60 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. తక్షణమే తీర్చాల్సిన బకాయిలు రూ.30 కోట్ల వరకూ ఉంటాయి. రైతులకు కూడా బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది.

డెయిరీకి సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా కూడా పలుమార్లు నిలిపివేశారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకర్లతో పాటు విశాఖ డెయిరీ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. డెయిరీ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో సుమారు 25 వేల మంది పాడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన తరుణంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News