KTR: జీహెచ్‌ఎంసీ అధికారులపై మండిపడ్డ తెలంగాణ మంత్రి కేటీఆర్‌

  • నగరంలో రోడ్లు తవ్వకూడదు
  • రోడ్ల త‌వ్వకాల‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి
  • రోడ్లపై గుంత‌లు ఎందుకుంటున్నాయి

జీహెచ్‌ఎంసీ పనితీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడుతూ.. నగరంలో రోడ్లు తవ్వకూడదని చెబుతున్నప్పటికీ, అదే పని చేస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన అనుమ‌తుల‌ను చూపించి ఇప్పుడు కూడా వాటిని కొన‌సాగిస్తున్నారని మండిపడ్డారు. రోడ్ల త‌వ్వకాల‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి స‌మాధానం చెప్పాలంటే ఇబ్బందిగా ఉంద‌ని అన్నారు.

 హైదరాబాద్‌లో ప్రతి ఏడాది రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ రోడ్ల ప‌రిస్థితి మారట్లేదని, వాటిపై గుంత‌లు ఎందుకున్నాయని అడిగారు. నాలాల పూడిక‌తీత‌కు విధించిన డెడ్‌లైన్‌ ముగిసి నెలరోజులు దాటిపోయినప్పటికీ ఇంకా పూర్తి చేయలేదని అన్నారు.

  • Loading...

More Telugu News