Andhra Pradesh: ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుండటం బాధాకరం: రఘువీరారెడ్డి

  • ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
  • ఈ విందుకు హాజరైన ఊమెన్ చాందీ, కేవీపీ తదితరులు
  • రాహుల్ నాయకత్వంలోనే ప్రజలకు న్యాయం: రఘువీరా

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందుకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి ఊమెన్ చాందీ, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు రఘువీరారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తుండటం చాలా బాధాకరమని, రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఒక్కటేనని నిరూపించుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఒక్క రాహుల్ గాంధీకే ఉన్నాయని రఘువీరా అన్నారు. రాహుల్ నాయకత్వంలో మాత్రమే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

Andhra Pradesh
raghuveera reddy
oomen chandy
  • Loading...

More Telugu News