Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

  • ఈదురుగాలులతో కూడిన వర్షం
  • రోడ్లు జలమయం 
  • పశ్చిమ బెంగాల్‌ నుంచి ఉ.కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి

హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. మలక్‌పేట, చంపాపేట్‌, సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, మీర్‌పేట్‌, ముషీరాబాద్‌, కోఠి, అబిడ్స్‌, ఎస్సార్‌ నగర్‌, యూసఫ్‌గూడతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి.

 కాగా, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒడిశా మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మంచిర్యాల, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Hyderabad
rain
  • Loading...

More Telugu News