Chandrababu: చంద్రబాబుపై ఏ1, ఏ2 లు విమర్శలు చేయడం దారుణం: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

  • మట్టి తవ్వకాల్లో అవినీతి జరిగిందని ఆరోపించడం దారుణం
  • మోదీని విమర్శించని జగన్..  బాబును మాత్రం విమర్శిస్తున్నారు
  • కేంద్రం చేస్తున్న కుట్రలో జగన్, పవన్ కల్యాణ్ లు పాత్రధారులు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ఏ1, ఏ2లు విమర్శలు చేయడం దారుణమంటూ జగన్, విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మట్టి తవ్వకాల్లో రూ.33 వేల కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపించడం దారుణమని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించని జగన్.. చంద్రబాబును విమర్శిస్తున్నారని, మోదీ, జగన్ లాలూచీ పడ్డారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో జగన్, పవన్ కల్యాణ్ లు పాత్రధారులని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో జగన్, పవన్, కన్నా లక్ష్మీనారాయణలకు ప్రజల తిరస్కారం తప్పదని జోస్యం చెప్పారు.

Chandrababu
Jagan
vijaya sai
budha venkanna
  • Loading...

More Telugu News