Jagan: రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ వంతెనపై కొనసాగుతున్న జగన్ పాదయాత్ర!
- తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తోన్న జగన్ పాదయాత్ర
- 4.1 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు కమ్ రైలు వంతెన
- జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తల ఘనస్వాగతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్ వంతెన మీదుగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ఈరోజు సాయంత్రం కోటిపల్లి బస్టాండ్ వద్ద జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు.
కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధ్య 4.1 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు కమ్ రైలు వంతెన ఉంటుంది. వంతెన మీదుగా పాదయాత్రకు మొదట పోలీసులు అనుమతినివ్వని విషయం తెలిసిందే. చివరకు షరతులతో కూడిన అనుమతిని ఇవ్వడం జరిగింది. దీంతో జగన్ షెడ్యూల్ ప్రకారం రోడ్డు కమ్ రైల్ వంతెన మీదుగానే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయనకు అక్కడి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.